దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించినా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేసించి ప్రసంగిస్తున్నారు. ప్రధాని మోదీ ఏం చెబుతారో అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ ఈరోజు కరోనా గురించి, లాక్ డౌన్ గురించి కీలక ప్రకటనలు చేయనున్నారు. 
 
ప్రధాని మోదీ మాట్లాడుతూ నాలుగు నెలలుగా దేశం కరోనాతో పోరాడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది కరోనా భారీన పడ్డారని పేర్కొన్నారు. 2,88,000 మంది కరోనాతో చనిపోయారని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభం గతంలో ఎప్పుడూ చూడలేదని... ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని అన్నారు. ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్లాలని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: