ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో శీతాకాల విరామం అనంతరం బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తీశారు. మొదట పూజారులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన పూజారితో పాటు 28 మంది హాజరయ్యారు. బంతిపూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గత సంవత్సరం ఆలయం తెరిచిన రోజున దాదాపు 10,000 మంది భక్తులు హాజరు కాగా ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో భక్తులను అనుమతించటం లేదు. 
 
ఈరోజు బద్రీనాథ్ ఆలయంలో ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి త్రీవేంద్రసింగ్‌ రావత్‌, గవర్నర్‌ బేబీ రాణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. గుడి ధర్మాధికారి భవన్‌ చంద్ర ఉనియాల్‌ మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ 30వ తేదీన తెరుచుకోవాల్సిన ఆలయ తలుపులు తెరుచుకోలేదని అన్నారు. ఉత్తరాఖండ్‌లోని నర, నారాయణ పర్వతాల మధ్య అలకనంద నది ఎడమవైపు తీరంలో పవిత్ర బద్రీనాథ్ పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఇక్కడి అందాలు పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: