ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్ది ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు ఈరోజు 5,500 రూపాయలు ఖతాలలో జమ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సీఎం జగన్ రైతులతో మాట్లాడుతూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని అన్నా అని పిలిచారు. సాధారణంగా జగన్ మంత్రి బాలినేని మామ అని పిలుస్తారు కానీ ఈరోజు మాత్రం పుసుక్కున మిగతా వాళ్లను అన్నా అని పిలుస్తూ బాలినేనిని కూడా అలానే పిలిచారు. 
 
సీఎం జగన్ ఈరోజు రైతులకు ప్రయోజనం చేకూరేలా అనేక నిర్ణయాలను ప్రకటించారు. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు భూసార పరీక్షలు జరిపిస్తామని అన్నారు. త్వరలో వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతులకు నగదు బదిలీ కాకపోతే 1902 నంబర్ కు ఫోన్ చేయాలని సీఎం చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: