ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో శుభవార్త చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అక్కడ ఉండదని అక్కడి నుంచి కంపెనీని వేరే చోటుకు తరలిస్తామని చెప్పారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో తప్పు జరిగినట్టు తేలితే ఎవరినీ ఉపేక్షించమని అన్నారు . ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించారని అన్నారు. 
 
విశాఖ గ్యాస్ లీకేజ్ పాపం గత ప్రభుత్వాలదే అని జగన్ చెప్పారు. బాధితుల కోసం 37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని అన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమించామని తెలిపారు. ఆస్పత్రుల్లో మూడు రోజుల పాటు చికిత్స పొందిన 485 మందికి లక్ష రూపాయల నష్ట పరిహారం పంపిణీ చేశామని అన్నారు. ప్రభుత్వం బాధితులకు అండ్గగా ఉంటుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: