గత రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో చెట్లు విరిగిపోతున్నాయి.. అయితే వాటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది తెగ కష్టపడుతున్నారు.  కింద పడ్డ కొమ్మలను తొలగించడం ఎవరికైనా సాద్యమైన పనే.. కానీ రెండు హైటెన్షన్ వైర్ల మద్య చిక్కుకున్న కొమ్మను తొలగించాలంటే.. కష్టంతో కూడుకున్న విషయం. కానీ ఓ ఉద్యోగి ప్రాణాలకు తెగించి చేసిన సాహసం చూస్తుంటే  ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.  వివరాల్లోకి వెళితే..  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్‌లో రెండు హైటెన్షన్ వైర్ల మద్య చెట్టు కొమ్మ ఇరుక్కుంది. ఓ ఉద్యోగి విద్యుత్‌ తీగలపై నడుచుకుంటూ వెళ్లి ఆ చెట్టు కొమ్మను తొలిగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.

 

ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్‌లో చోటు చేసుకుంది. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చేసిన ఈ సాహసం పట్ల అధికారులు మండిపడ్డారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో అతడికి ఏ ప్రమాదమూ జరగలేదు. ఏది ఏమైనా అంత సన్న వైర్లపై నడుచుకుంటూ.. అది కూడా ప్రమాదకరమైన హైటెన్షన్ వైర్లు అన్న విషయం తెలిసి అతడు చేసిన సాహసం గొప్పదే అయినా.. ఏమాత్రం ప్రమాదం జరిగినా నిర్లక్ష్యం వహించానా ప్రాణాలకు ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: