తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. ఏపీలో రెండు రోజుల క్రితం ఇంటర్ ఫలితాలు విడుదల కాగా తెలంగాణలో ఈ నెల 16 లేదా 17న ఫలితాలను విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రక్రియను పూర్తి చేసి ఇంటర్ బోర్డ్ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అమోదం తీసుకోనున్నారు. మంత్రి ఆమోదం పొందిన అనంతరం ఫలితాలను రేపు లేదా ఎల్లుండి విడుదల చేయనున్నారు. 
 
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని బోర్డు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యేవి. ఈ సంవత్సరం కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో మూల్యాంకనం ఆలస్యంగా ప్రారంభమైంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు వేగంగా ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: