రాజస్థాన్ లో  తిరుగుబాటు నేత అయిన సచిన్ పైలెట్  కాంగ్రెస్ అధిష్టానం ముందు డిమాండ్ల చిట్టా ఉంచినట్లు  తెలుస్తోంది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం పైలెట్ కి ఇటీవలే ప్రియాంక గాంధీ ఫోన్ చేయగా.. తనను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలని అధికారికంగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వాగ్దానం చేయించాలని అలా అయితేనే రాహుల్ గాంధీ,  సోనియా గాంధీని కలుస్తాను  అంటూ సచిన్ పైలెట్ పట్టుబడ్డారు. 

 

 అయితే ప్రియాంక  గాంధీ మాట దాట వేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ చుట్టూ తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని డిమాండ్ వద్దకు వచ్చారట. ఒకవేళ తనను  రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేయకపోతే సోనియా రాహుల్ గాంధీతో భేటీ అయినప్పటికీ ఎలాంటి లాభం ఉండదు అంటూ తేల్చి చెప్పారట సచిన్ పైలెట్. ఇక ఈ డిమాండ్లను చూసిన తర్వాతనే కాంగ్రెస్ అధిష్టానం ఆయనను డిప్యూటీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా తొలగించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: