వచ్చే ఏడాది తొలినాళ్లల్లో.. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి భారత్​కు కరోనా వ్యాక్సిన్​ అందుబాటులో ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. అందుక తగ్గట్టుగానే పంపిణీపై ప్రణాళికలు రచిస్తున్నట్టు స్పష్టం చేశారు.కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రుల బృందం(జీఓఎమ్​) వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు హర్షవర్ధన్​.వచ్చే జులై నాటికి దేశంలోని 20-25 కోట్ల మంది ప్రజలకు 40-45 కోట్ల వ్యాక్సిన్​ డోసులు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్యమంత్రి.



కరోనా వ్యాక్సిన్​ టీకా అభివృద్ధి, క్లినికల్​ ట్రయల్స్​ కోసం సంస్థలకు ఆర్థిక సహకారం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన అనంతరం 400-500 మిలియన్​ డోసులు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: