ఏపీలో త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనాతో మృతి చెందిన ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద రావు మ‌ర‌ణంతో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక జ‌ర‌గ‌కుండానే మ‌రో ఉప ఎన్నిక కూడా రానుంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఈ రోజు ఉద‌యం అనారోగ్యంతో మృతి చెందారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటసుబ్బయ్య బద్వేలు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బ‌ద్వేల్ స్తానానికి ఆరు నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: