దేశంలో కరోనా కేసులు రోజుకు సగటున 3 లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోన్న కేసుల వివరాలకు, వాస్తవంగా నమోదు అవుతోన్న కేసులకు పొంతన లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా తాజాగా దిగ్గజ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ఆధారాలతో ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం భారత్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 52 కోట్లు, మరణాలు 9.90 లక్షలుగా ఉన్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం మంగళవారానికి మొత్తం 1.76 కోట్ల మంది కరోనా బారిన పడగా, 1.98 లక్షల మంది కొవిడ్‌తో చనిపోయారు. భారత్‌లో ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలకు మరో 30 రెట్లు ఎక్కువగా కేసులు, మరణాలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు నిజాలను దాచిపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు.