తమిళనాడులోని వేలూరు జిల్లాలో గల నాచ్చంబట్టు అటవీ ప్రాంతంలో సారా కాస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సిబ్బంది తో కలిసి అరియార్ ఎస్సై ఘటన స్థలానికి వెళ్ళాడు. తనిఖీలకు వచ్చిన పోలుసులను చూడగానే.. సారా కాసేవారు భయం తో పరుగులు తీశారు. ఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ క్రమంలో అక్కడి వున్న ఇండ్లల్లో తనిఖీలు చేశారు. సారా తయారీకి సంబంధించి ఉపయోగించే వస్తువులను పోలీసు సిబ్బంది ధ్వంసం చేశారు. అక్కడే వున్న ఇండల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. రెండు ఇండ్లు తాళం వేసి కనిపించాయి. దీంతో వారు తలుపులు పగుల గొట్టి తనికీలు చేస్తుండగా.. 8 లక్షల నగదు కన్పించింది. దాంతో పాటు బంగారం కూడా అక్కడ వున్నది. దీంతో సదరు పోలీసుల కన్ను వాటిపై పడింది. అక్కడ స్థానికులు లేకపోవడంతో వాటిని కాజేయాలని సిబ్బంది యత్నించింది. గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ సొమ్మును తీసుకుపోవడం సరికాదని వారితో వారించారు. అయినప్పటికీ పోలీసులు వినలేదు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్థులు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సదరు సిబ్బంది పై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. విచారణ జరిపిన ఏఎస్పీ సదరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై కేసు కూడా నమోదు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి