గ్రూప్-1 పరీక్షల విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూల్యాంకనం కేసులో నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం పట్ల హైకోర్టులో కొందరు అభ్యర్ధులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సంస్థ చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థ టీసీఎస్ చేయడం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. 


అయితే ఏపీపీఎస్సీ కూడా మెయిన్స్ పేపర్ల మూల్యాంకనాన్ని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తామని చెప్పలేదని వాదించింది. కానీ ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఆ తీర్పును నేడు ప్రకటిస్తూ ఈ పరీక్షల తదనందర చర్యలు అన్నిటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: