ప్రస్తుతం వివిధ జిల్లాల్లో కూటమి నాయకుల మధ్య అంతరాలు.. విభేదాలు కొనసాగుతున్నాయి. కలివి అనేది నేతి బీరలో నెయ్యి చందంగా మారిపోయింది. దీంతో తటస్థంగా ఉంటూ.. కూటమి నాయకులను కలుపుకొని నాయకులకు.. చంద్రబాబు పార్టీలో పెద్ద పీట వేశారు. వారిలో అనేక పరీక్షలు నిర్వహించి.. చివరకు జిల్లాలకు, పార్లమెంటునియోజకవర్గాలకు బాధ్యులను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ప్రక్రియ బాగానే ఉన్నా.. ఎంపిక పూర్తయ్యాక.. అనేక చిక్కులు వస్తున్నాయి.
పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన వారికి రెండేసి పదవులు ఇవ్వడం పెద్ద వివాదంగా మారింది. ఉదాహర ణకు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఇదే సమయంలో జిల్లా పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి అనురాధకు ఇచ్చారు. దీంతో నగరంలో బాధ్యతల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కుటుంబానికి ఒక పదవి ఇవ్వాలని.. తద్వారా ఎక్కువ మంది ప్రాధాన్యం ఉంటుందని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు.
కానీ, ఎంపిక ప్రక్రియ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంత తేడా కొట్టింది. ఇదే ఇప్పుడు వివాదంగామారింది. మరికొన్ని చోట్ల పార్టీలో పెద్దగా బలంలేని నాయకులకు బాధ్యతలు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నా.. ఆ వర్గానికి ఆశించిన మేరకు ప్రయోజనం చేకూరలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇలా.. అనేక కారణాలతో ప్రస్తుతం పదవులు పొందినవారు.. సహకరించేవారు లేక.. సహకారం ఉన్నవారు.. తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి