త‌మిళ స్టార్ హీరో త‌ళ‌ప‌తి విజ‌య్ నేడు పుట్టినరోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంధ‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రెటీ ప్ర‌ముకులు ఆయ‌న‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా త‌మిళ స్టార్ విజ‌య్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. ఈ పోస్ట్ లో మ‌హేశ్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు విజయ్ మీకు ఈ సంవ‌త్స‌రం గుర్తుండి పోయేలా ఉండాల‌ని కోరుకుంటున్నాను. 

అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు తెలుగులో డ‌బ్ చేయ‌డం ద్వారా తెలుగు వారికి ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు ఏకంగా నేరుగా తెలుగులో సినిమా చేయ‌బోతున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అంతే కాకుండా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: