ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దర్గ అమ్మ‌వారికి భాగ్య‌న‌గ‌ర్ బోనాల ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు బంగారు బోనాన్ని స‌మ‌ర్పించారు. బంగారు బోనం సిర‌స్సుపై ధ‌రించి దారి పొడ‌వునా నృత్యాలు చేస్తూ దుర్గ‌మ్మ నామ‌స్మ‌ర‌ణ‌తో ఇంద్ర‌కీలాద్రి ప్రాంతం మారుమ్రోగింది.జ‌మ్మిదొడ్డి వ‌ద్ద ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలను భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ స‌భ్యులు నిర్వ‌హించారు. కమిటీ సభ్యులకు దుర్గగుడి ఈవో భ్రమరాంబ, చైర్మన్ పైలా సోమినాయుడులు స్వాగ‌తం ప‌లికారు.అనంతరం జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపుగా ఘాట్ రోడ్డుమీదుగా డప్పు వాయిధ్యాలు, వివిధ కళాకారులతో జాతరగా  దుర్గ‌మ్మ‌కు బోనం సమర్పించారు.గ‌త 12 సంవ‌త్స‌రాలుగా బెజ‌వాడ దుర్గ‌మ్మ‌కు బంగారు బోనాన్ని స‌మ‌ర్పించ‌డం అన‌వాయితీగా వ‌స్తుంది.క‌రోనా మ‌హామ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు గుమిగూడ‌కూండా ఆల‌య అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: