నేను రెడీ... ఇక మీదే లేటు అంటున్నాడు టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ. ఆయన ఈ డైలాగ్ ఎందుకు కొట్టాడు అంటే ఓ నెటిజన్ సామజిక మాధ్యమంలో హీరో గా ట్రై చేయండి అంటూ బ్రహ్మాజీకి సలహా ఇచ్చాడు. టాలీవుడ్ లో ఇప్పటికే సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి పలువురు కమెడియన్లు హీరోలుగా వెండితెరపై మెరిసారు. అయితే ఎప్పటినుంచో సినిమాలో నటిస్తున్న బ్రహ్మాజీ మాత్రం అలాగే ఉండిపోయారు. కెరీర్ మొదటి నుండి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గానే చేస్తున్నారు. అందుకే ఆయన అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ సీనియర్ నటుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కనిపించాలనే కోరికను వ్యక్తపరిచాడు. వారి కోరికకు బ్రహ్మాజీ కూడా సై అంటున్నాడు. మన దర్శక నిర్మాతలు ఈ సీనియర్ యాక్టర్ కోసం ఏమైనా కథలు తయారు చేస్తారు ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: