లవ్ రంజన్ సినిమా షూటింగ్ లో ఉన్న నటి నిష్రత్ భరుచ్చ ను హుటా హుటిన ఆసుపత్రి కి తరలించారు. ఆమెకు వెర్టిగో అటాక్‌గా వైద్యులు నిర్ధారించారు. ఇక నుష్రత్ ఆరోగ్యం సరిగా లేనందున సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపి వేయబడింది. ఇక మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన సదరు ప్రొడక్షన్ కంపెనీ పలు వివరాలను తెలిపింది. నుష్రత్ కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. ఇక ఆసుపత్రి కి తరలించడానికి ఒక రోజు ముందు కూడా తాను ఆరోగ్యం సరిగ్గా లేక సెలవు తీసుకుందని, మరుసటి రోజు బాగానే కనిపించిందని తెలిపారు. ఇక ఆమెకు సడన్ గా వెర్టిగో అట్టాక్ కావడంతో ముంబైలో ని హిందూజా ఆసుపత్రి కి తరలించగా, ఆమె కొంచం బలహీనం గా ఉన్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: