హంటింగ్టన్ లో బీచ్ లోకి  ముడి చమురు వెల్లువ

కాలిఫోర్నియాలోని హంటింగ్ స్టన్ బీచ్ సమీపంలో లోని  చమురు  బావి నుంచి  ముడి చమురు పైకి  ప్రవాహంలా తన్నుకు వచ్చింది. దీంతో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో గందర గోళ పరిస్థితి నెలకోంది. హంటింగ్టన్ లో బీచ్ సమీపంలో గల చమురు బావిలో   అయిల్ లీక అవుతున్న విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు.  లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు.  దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న సమయంలోనే మరో చోట ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ముడి చమురు లీక్  అయింది. లక్షా ఇరవై ఆరు వేల గాలన్ల ముడి చమురు  పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చి పడింది. చమురు తెట్టుగా ఏర్పడటంతో  తీరం వెంబడి ఉన్న గ్రామాలప్రజలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. పర్యటనలో ఉన్న హంటింగ్టన్  మేయర్ కిమ్ కార్ హుటాహుటిన నగరానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. చమురు ప్రవాహం సముద్రం పై 4.5 నాటికల్ మైళ్ల వరకూ వ్యాపించి ఉండవచ్చని మేయర్ తెలిపారు.  ఈ ఉపద్రవం వల్ల పెద్ద సంఖ్యలో సముద్ర జీవరాశి మరణించింది.  పర్యావరణం పై ప్రభావాన్ని చూపిందని పర్యావరణ వేత్తలు పేర్కోన్నారు. దీనిని పెద్ద విపత్తుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్  అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

oil