హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు గురువారం కూడా జ‌రుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హెటిరో ల్యాబ్స్‌పై సోదాలు జరిపారు. కోవిడ్ 19 సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను అధికారులు స‌మ‌గ్రంగా పరిశీలించారు. హెటిరో డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఈ దాడులు కొనసాగాయి. అలాగే వారి పాట్నర్ ఇళ్లలోనూ సోదాలు జ‌రిగాయి. హైదరాబాద్ సనత్‌నగర్ హెటిరో హెడ్ ఆఫీస్‌తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలంలో ఉన్న హెటిరో కార్యాలయంలో కూడా ఐటి అధికారులు సోదాలు జ‌రిపారు. ఇటీవల హురాన్ ఇండియా ప్రకటించిన బిలినియర్ల లిస్టులో హైదరాబాద్ నుంచి  హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారధి రెడ్డి రెండో స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 58వ అత్యoత  ధనికుడిగా హెటిరో పార్థ సారథి రెడ్డి ఉన్నారు. కొవిడ్‌-19 స‌మ‌యంలో ఉత్ప‌త్తి చేసిన ఫాబీపూర్ కు సంబంధించి స‌మ‌గ్ర‌మైన వివ‌రాలు లేవ‌ని, వాటి ఉత్ప‌త్తి, అమ్మ‌కాల‌కు సంబంధించిన అన్ని వివ‌రాలు ఐటీ అధికారులు తెలుసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

it