మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌కు అనుకూలంగా రావడం మంచు విష్ణు ప్యానెల్‌లోని నరేష్‌ను నారాజ్‌ అయ్యేలా చేసింది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న కౌంటింగులో ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపులో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ స్పష్టమైన ఆధిక్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగానే ప్రకాష్ రాజ్‌ ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్న శివారెడ్డి, కౌశిక్‌లు విజయం సాధించినట్లు తెలుస్తోంది ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లోని ఈసీ మెంబర్లకు పడిన ఓట్ల లెక్కింపులో లీడ్‌ ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఈసీ మెంబర్‌ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే అధ్యక్ష పదవి ఓట్ల లెక్కింపు చేపడతారు. అధ్యక్ష ఓట్ల లెక్కింపు మూడు నాలుగు గంటల సేపు జరగవచ్చునని మా వర్గాలు అనుకుంటున్నాయి మొత్తంమీద ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపులో ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్‌కు క్లీన్ ఎడ్జ్‌ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మా ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని ఈసీ మెంబర్ ల గెలుపునకు అనుకూలంగా రావడంతో మంచు విష్ణు ప్యానల్ లోని నరేష్ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి నిష్క్రమించడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: