తెలుగు సినీ పాట‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత తీసుకొచ్చిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత చెంబోలు సీతారామ శాస్త్రీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌క‌టించారు. సీతారామశాస్త్రి ఇంటి పేరు మార్చినది కళాతపస్వి కె.విశ్వనాథ్ సిరివెన్నెల మూవీ. ఇక అప్ప‌టి నుంచి ఆయన పేరు సిరివెన్నెలగా పిల‌వ‌బ‌డేది. దాదాపు 165 చిత్రాల‌కు పైగా  మొత్తం 3వేల‌కు పై చిలుకు పాట‌ల‌ను రాసి రికార్డును నెల‌కొల్పాడు సిరివెన్నెల‌.

సిరివెన్నెల మృతిపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సంతాపం  వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్‌ స్పందిస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి  ఇక లేరనే వార్త విని నిరుత్సాహానికి గురయ్యానని తెలిపారు.  ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్‌ వేదికగా సంతాపం ప్ర‌క‌టించారు. ముఖ్యంగా నువ్వు నాకున‌చ్చావ్‌, దేవీపుత్రుడు, క్ష‌ణ‌క్ష‌ణం వంటి ప‌లు సినిమాల‌కు హిట్ సాంగ్‌ల‌ను రాసాడ‌ని గుర్తు చేసుకున్నారు వెంక‌టేశ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: