ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఓ దారుణ‌మా.. లేక  విచిత్రం అనే విధమైన‌ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది.పిల్ల‌ల‌కు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మ‌ద్యం మ‌త్తులో తూగుతూ పాఠ‌శాల‌కు వ‌చ్చాడు. అయితే మ‌ద్యం కిక్కు ఎక్కువై త‌ర‌గ‌తిగ‌దిలోనే తూలుతూ ప‌డిపోయాడు. దీంతో విద్యార్థులు అత‌న్ని లేవండి సార్‌.. లేవండి అని లేపినా కానీ లేవ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లా వంగ‌ర  మండ‌లం కొప్ప‌రవ‌ల‌స ప్రాథమికొన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు తిరుప‌తిరావు మంగ‌ళ‌వారం ఫూటుగా మ‌ద్యం సేవించి త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యాడు. క‌నీసం నిల్చులేని స్థితిలో నేల‌పై కూర్చుండిపోయాడు. విద్యార్థులు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు  పాఠ‌శాల వ‌ద్దే ఉండి ఇంటికి వెళ్లి పోయారు.  త‌ల్లిదండ్రులు అక్క‌డికి చేరుకొని ప్ర‌ధానోపాధ్యాయుడిపై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇక్క‌డ విధులు నిర్వ‌హించ‌డానికి మ‌రో ఉపాధ్యాయురాలు ఉండ‌గా.. ఆమె నిన్న సెల‌వులో ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంఈవో దుర్గారావు స్పందిస్తూ ప్ర‌ధానోపాధ్యాయుడిపై గ‌తంలోనే ఫిర్యాదు అందిన‌ద‌ని, డీఈవోకు నివేదిక‌ను కూడా ఇచ్చామ‌ని గుర్తు చేసారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: