త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఊటీ స‌మీపంలో కూనూరు నీల‌గిరి కొండ‌ల్లో ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప కూల‌డంతో  అందులో ఉన్న 14 మంది ప్ర‌యాణికులు మృత్యువాత‌ప‌డ్డారు. ఆ హెలికాప్ట‌ర్ వెల్లింగ్ట‌న్ వ‌ద్ద‌కు చేరుకునేందుకు సూలూరు ఆర్మీ క్యాంపు బేస్ నుంచి బ‌య‌లు దేరి వెళ్లింది. మ‌రొక 5 నిమిషాల వ్య‌వ‌ధిలో వెల్లింగ్ట‌న్ చేరుకుంటుంద‌న‌గా మార్గ‌మ‌ధ్య‌లో కూనూరు నీల‌గిరి కొండ‌ల్లో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. అది చూసిన స్థానికులు భ‌యాందోళ‌న‌కు గురై కొద్ది సేప‌టి వ‌ర‌కు అక్క‌డికి చేరుకోలేదు. ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాన్ని తొలుత క‌ట్టేరి గ్రామ‌స్తులు గుర్తించారు.

ఈ హెలికాప్ట‌ర్‌లో ఐదుగురు సిబ్బంది, రావ‌త్ దంప‌తులు, ఆర్మీ అధికారులున్నారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన త‌రువాత బిపిన్ రావ‌త్‌ను వెల్లింగ్ట‌న్ ఆసుప‌త్రికి త‌ర‌లించి  ముగ్గురు  డాక్ట‌ర్లు చికిత్స‌ను అందించారు.  90 శాతం గాయాల‌తో చికిత్స పొందుతూ  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృత్యువాత ప‌డ్డారు. భార్య మ‌ధులిక ఘ‌ట‌న స్థ‌లంలోనే మృతి చెందింది. బ్లాక్ బాక్స్ కోసం ఆర్మీ అధికారులు వెత‌క‌డం మొదలు పెట్టారు. 2011లో ఈ హెలికాప్ట‌ర్ కొనుగోలు చేసారని స‌మాచారం. అయితే ఈ ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతం వెల్లింగ్ట‌న్ ఆర్మీ క్యాంపున‌కు దాదాపు 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ది. మ‌రొక ఐదు నిమిషాల‌లో ఆర్మీ క్యాంపులో హెలికాప్ట‌ర్ ల్యాండ్ అవ్వాల్సి ఉండ‌గా.. అక‌స్మాత్తుగా ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ట్విట్ట‌ర్ ద్వారా  బిపిన్ రావ‌త్ మృతి చెందార‌ని ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ప్ర‌క‌టించింది.  




మరింత సమాచారం తెలుసుకోండి: