హైదరాబాద్‌కు చెందిన ఓ చిన్నారిని కాపాడేందుకు ఏకంగా రూ. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్‌ను ఓ సంస్థ ఉచితంగా అందించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న పాపను కాపాడేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లివాసులు ప్రవీణ్‌, స్టెల్లా దంపతుల 23 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది.


ఈ వ్యాధి చికిత్స కోసం రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం. పాప కోసం ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ నోవార్టిస్‌ ఫార్మా కార్పొరేట్‌ రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను ఉచితంగా అందించింది. సామాజిక బాధ్యత కింద ఈ  ఇంజక్షన్ అందజేసింది. ఆ ఇంజక్షన్‌తో సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స ఇచ్చారు. పాప క్రమంగా కోలుకుంటోంది. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపి-2 అనే ఈ వ్యాధి వల్ల మెదడు కండరాలు క్షీణించి పిల్లలు మాట్లాడలేరు. నడవలేరు. పడుకొని లేవలేరు. ఆహారం కూడా మింగలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: