తెలంగాణ రాష్ట్రం రెండు విషయాల్లో దేశంలోనే టాప్ గా నిలిచింది. బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్‌ప్లస్‌ స్థాయి పొందింది. ఈ స్థాయి పొందిన టాప్‌ 5 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి. వీటిలో తెలంగాణ టాప్ ప్లేస్ దక్కించుకుంది.


అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు తాగునీరు అందించే రాష్ట్రాల జాబితాలోనూ తెలంగాణ టాప్‌ గా నిలిచింది. టాప్‌-3 రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఉన్నట్టు కేంద్ర జల్‌శక్తిశాఖ తెలిపింది. గోవా, తెలంగాణ, హరియాణ ఈ టాప్‌ త్రీ రాష్ట్రాలు. అలాగే  కేంద్రపాలిత ప్రాంతాల్లో.. పుదుచ్చేరి, దాద్రానగర్‌హవేలీ దయ్యూదామన్‌, అండమాన్‌నికోబార్‌ దీవులు టాప్ త్రీలో ఉన్నాయి. ఇవన్నీ 100% ఇళ్లకు నల్లా నీరు అందిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ అలా అదరగొడుతుందన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి: