ఇటీవల దిల్లీలో అఫ్తాబ్ అనే యువకుడు శ్రద్ధా అనే యువతిని దారుణంగా చంపేసి.. శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి.. ఎక్కడెక్కడో విసిరేసిన ఉదంతం కలకలం రేపింది. అయితే.. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన మాదిరిగానే అఫ్తాబ్ ను ఎన్ కౌంటర్ చేస్తే ఆ పోలీస్ అధికారికి 5 లక్షల రూపాయలు నగదు బహుమతిని అందజేస్తామని జన జాగరణ సమితి  చెబుతోంది.


ఆ సంస్థ రాష్ట్ర కన్వీనర్ వాసు విశాఖలో తెలిపారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ హత్యోఉదంతం అత్యంత అమానవీయమైన ఘటన అని జన జాగరణ సమితి  చెబుతోంది. నిర్భయ ఘటన తర్వాత ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జన జాగరణ సమితి  చెబుతోంది. తనను పెళ్ళిచేసుకోమని అడిగిన పాపానికి శ్రద్దా వాకర్ ను క్రూరాతి క్రూరంగా 35 ముక్కలుగా నరికేసిన మానవ మృగం.. అఫ్తాబ్ ను తక్షణమే ఎన్ కౌంటర్ చేయాలని జన జాగరణ సమితి  డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటన పై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించాలని జన జాగరణ సమితి  కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: