రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరంను సవాళ్లకు ప్రతి సవాళ్లకు వేదికగా మార్చకూడదని టీపీసీసీ నేత జి.నిరంజన్ అంటున్నారు. భాగ్యలక్ష్మి మందిరం వద్ద విమర్శలకు ప్రతి విమర్శలకు తావిస్తే ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు దేశ విదేశాల నుండి ఆమ్మ వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల ఏకాగ్రత దెబ్బతింటుందని.. టి.ఆర్.ఎస్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. భాగ్యలక్ష్మి మందిరానికి వస్తా , బిజెపి నాయకులు కూడా వచ్చి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని చేసిన సవాలు సరి కాదని టీపీసీసీ నేత జి.నిరంజన్ అన్నారు.


రోహిత్‌ రెడ్డి ఏ చౌరస్తాలోనైనా కూర్చుని సవాలు చేయవచ్చని.. మందిరము వద్ద మాత్రం కాదని.. అమ్మ వారిని ఎవరైనా దర్శించుకోవచ్చు కానీ ఇటువంటి కార్యకలాపాలకు మందిరం నిర్వాహకులు అనుమతించవద్దని టీపీసీసీ నేత జి.నిరంజన్ అన్నారు. మందిరం దగ్గర ఇటువంటి విషయాలపై ఎవరూ మీడియాతో మాట్లాడకుండా అటు మీడియా ఇటు పోలీసులు జాగ్రత్త వహించాలని టీపీసీసీ నేత జి.నిరంజన్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: