పవన్ కల్యాణ్‌ మరోసారి కీలకమైన వ్యాఖ్యాలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కౌలు రైతుల భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. 220 రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇదే సీయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను నేను కోరుకుంటే సీఎం కాను.. మీరు కోరుకుంటే సీఎం అవుతానన్నారు పవన్ కళ్యాణ్ .


వైసిపి వ్యతిరేక ఓటును చీల్చను... దానికి కట్టుబడి ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది.. కొత్త ప్రభుత్వం వస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రాదని.. వైసిపి అధికారంలోకి రాకుండా చూసుకునే భాద్యత నాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనసత్వమని విమర్శించిన పవన్ కళ్యాణ్.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు మీరు ఇరిగేషన్ మంత్రా అంటూ ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: