తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగియనుంది. ఈ ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి వెళ్ళనున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ ఉదయం 11:30కి తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకుంటారు.

తన పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో విందు ఇస్తారు. ఈ విందు తర్వాత సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిల్లీ తిరుగు పయనం అవుతారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ ప్రభుత్వం వీడ్కోలు పలకనుంది. హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత వాయిసేన ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రపతి మొదట శ్రీశైలం వెళ్లారు. ఆ తర్వాత భద్రాచలం, రామప్ప దేవాలయం కూడా సందర్శించారు. నిన్న సమతామూర్తిని దర్శించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: