వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు మంత్రి పదవిఆఫర్ చేసి ఉంటారని అందుకే ఆయన పార్టీ మారుతున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కోటంరెడ్డి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలు అయిన వారికీ మంత్రి పదవులు ఇవ్వలేదని.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ ఎవరికీ పట్టలేదని.. మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

పార్టీ మారాలనుకుంటున్నారు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపనలు చేస్తున్నారని.. తన లాంటి అమాయకుడికి జగన్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపించారని ఎన్నో సార్లు కోటంరెడ్డి చెప్పారని.. జగన్ కోసం మంత్రి పదవి వదలుకుని తొలి నుంచీ జగన్ వెంట నడిచిన బాలినేనికీ మంత్రి పదవి కొనసాగించలేదని కొడాలి నాని  గుర్తు చేసారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి రాదని కోటంరెడ్డి పార్టీ మారాలనుకుంటున్నారన్న కొడాలి నాని .. సామాజిక సమీకరణాల ప్రకారం వైఎస్ జగన్ మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: