పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి క్రమంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధిస్తున్నారు. తన రాకను వ్యతిరేకించిన సీనియర్లను ఇప్పుడు ప్రసన్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేఖ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను రేవంత్‌ రెడ్డి సీనియర్లకు అప్పగించారు. తిరగబడదాం-తరిమికొడదాం అన్ననినాదాన్నిఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా సీనియర్‌ నాయకులకు బాధ్యతలను రేవంత్‌ రెడ్డి అప్పగించారు.

ప్రతి అయిదు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక నాయకుడిని లెక్కన 119 నియోజక వర్గాలకు రేవంత్‌ రెడ్డి బాధ్యుడుగా నియమించారు. అందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు ఉన్నారు. వీరితో పాటు జానారెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌, అజారుద్దీన్‌, సుదర్శన్‌ రెడ్డి, మధుయాస్కీ, ప్రేమసాగర్‌ రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి వారు కూడా శాసనసభ నియోజక వర్గాలల్లో సమీక్షలు చేస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: