మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలిస్తే తన మనవడ్ని కూడా మంత్రిని చేస్తాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ల పిల్లలు, మనవళ్లను మంత్రులను చేయడానికేనా ప్రజలు కేసీఆర్ కు ఓటు వేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి పేదలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో రేవంత్ రెడ్డి రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బొంరాసుపేట, దుద్యాల, కొత్తపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన జనసభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రేవంత్ రెడ్డి ఓట్లను అభ్యర్థించారు. కొడంగల్ లో తనను లక్ష మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: