కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు పక్కా అంటున్నారు కేంద్ర మంత్రి అమిత్‌ షా. దర్యాప్తు సంస్థలు తప్పనిసరిగా కేసీఆర్ అవినీతిపై యాక్షన్ తీసుకుంటాయంటున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జికి కూడా సిఫారసు చేస్తామన్నారు. ధరణి పోర్టల్ భూకుంభకోణాలపై కూడా విచారణ చేపడుతామన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా.. కట్టలు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయని.. వాటిపై కేసీఆర్, కాంగ్రెస్ ను ప్రశ్నించాలని సూచించారు.


ఆ డబ్బులన్నీ తెలంగాణ ప్రజలవన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా.. వారంతా ప్రశ్నించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల తగ్గింపు అంశంపై రాష్ట్ర, కేంద్ర సర్కార్ రెండు కలిసి తగ్గిస్తే.. పేదలపై భారం పడదని.. కానీ కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రశ్నించారు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో భాజపా వెళ్తోంది.. అందుకే.. రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ పార్టీ మారారని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: