సెటిలర్లు.. ఈ పదమే కరెక్టు కాదు. కానీ ఎన్నికల ముందు ఈ పదంతో కొన్ని పత్రికలు విశ్లేషణలు రాశాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్‌ తీరుపై సెటిలర్లు ఆగ్రహంతో ఉన్నారని రాశారు. కానీ ఇప్పుడు హైదరాబాదులో నివసిస్తున్న సెటిలర్స్ విచిత్రమైన తీర్పు ఇచ్చారు. మీరు మీ ఆలోచనలు ఎవ్వరికి అర్థంకాలేదనేలా ఇచ్చారు. రాష్ట్రమొత్తం ఒకతీర్పిస్తే వారు ఇచ్చినతీర్పు విభిన్నంగా ఉంది. హైదరాబాద్ నగరమంతా కేసీఆర్‌ కే జైకొట్టింది.

కాంగ్రెస్ గెలుపు ఖమ్మం గుమ్మం దాటి ఓరుగల్లు పౌరుషాన్ని పుడికిపుచ్చుకొని నల్లగొండ కిల్లాగుండెల్లో ఒదిగి మహబూబ్‌గర్ మంచితనానికి జేజేలుపలికి కరీంనగర్ ను సైతంకలుపుకొని హైదరాబాదు వస్తే.. అక్కడ మాత్రం కాంగ్రెస్‌ను చతికెలు పడేసారు. హైదరాబాద్‌లో సగం మంది ఇంట్లో పడుకుంటే వచ్చిన సగం మంది కేసీఆర్ కు జై కొట్టారు. మొత్తానికి ఎంత డబ్బు ఇచ్చినా లొంగకుండా తన అనుకున్నదే చేసిన నా తెలంగాణ ప్రజలకు లాల్ సలాం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: