మార్కెట్ సూత్రం ప్ర‌కారం స‌ప్లై ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు వ‌స్తువు ధ‌ర త‌గ్గ‌డం..వ‌స్తువులు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు  లేదంటే... వినియోగం ఎక్కువ‌గా జ‌రిగిన‌ప్పుడు డిమాండ్ పెరిగి ధ‌ర పెరుగుతుంటుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో వివిధ దేశాలు లాక్‌డౌన్ కొన‌సాగిస్తున్న నేప‌థ్యంలో  ఎప్పుడూ డిమాండ్ క‌లిగి ఉండే క్రుడాయిల్‌కు అనుహ్యంగా డిమాండ్ ప‌డిపోయింది. ప్ర‌పంచంలోని అత్య‌ధిక దేశాలు లాక్‌డౌన్‌లో కొన‌సాగుతుండ‌టంతో ర‌వాణా పూర్తిగా స్తంభించింది. ఏదేశ రోడ్లు చూసిన ఖాళీగా క‌న‌బ‌డుతు న్నాయి.  దీంతో స‌హ‌జంగానే ఇంధ‌నం అవ‌స‌రం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.

 

దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల వాడకం  రికార్డు స్థాయిలో క‌నిష్ఠానికి ప‌డిపోయాయి.  చమురుకు డిమాండ్‌ భారీగా తగ్గిపోవడంతో అదేస్థాయిలో ధర పడిపోయింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం భారీగా తగ్గిపోవడం..దీనికి భిన్నంగా ఉత్పత్తి కొనసాగించడం దీనికి కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాజాగా బుధవారం బ్యారెల్‌కు 16డాల‌ర్ల మేర ధ‌ర‌ పతనమైంది. దీంతో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర గత తగ్గింపుతో పోలిస్తే 24శాతం పడిపోయి దాదాపు 16డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ(వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్) ధర 11.42 డాలర్లకు పడిపోయింది.

 

 1999 తరువాత బ్రెంట్‌ క్రూడాయిల్ ఈ స్థాయిలో పడిపోవడం తొలిసారి అనే చెప్పాలి. ఇప్పటికే ఆయా దేశాలు నిల్వ సామర్థ్యం లేక దిగుమతిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఉత్పత్తికి సంబంధించి ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించుకునే ఆలోచనలో పడ్డాయి. చమురు ఉత్పత్తి తగ్గించుకోకపోతే రానున్న రోజుల్లో వీటిధర మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా చ‌మురు ధ‌ర‌లు ప‌డిపోతుండ‌టంతో పెట్టుబ‌డులకు ప్ర‌జ‌లెవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దీంతో దేశీయ స్టాకు మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: