భార‌త స్టాక్‌ మార్కెట్లు జోరుగా దూసుకెళ్తున్నాయి. మంగ‌ళ‌వారం ప్రధాని మోదీ రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం నేప‌థ్యంలో మ‌దుపుదారులు ఉత్సాహంగా ట్రేడింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతో సెన్సెక్స్‌ ఒక దశలో 1000 పాయింట్లకు పైగా లాభపడింది. ఉదయం 9.35 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 825 పాయింట్లు లాభపడి 32,193 వద్ద కొనసాగుతుండ‌గా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 232 పాయింట్లు లాభపడి 9,428 దగ్గర ట్రేడింగ్‌ను కొన‌సాగిస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 75.20గా ఉంది. గ‌డిచిన కొద్దిరోజులుగా ఈస్థాయిలో మార్కెట్లు పుంజుకోవ‌డం ఇదే తొలిసార‌ని చెప్పాలి.


కరోనా మహమ్మారి-లాక్‌డౌన్ నేపథ్యంలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భారీ ప్యాకేజీని ప్రకటించిన విష‌యం తెలిసిందే. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇక‌ ఇది దేశ జీడీపీలో 10 శాతంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. లాక్ డౌన్ సమయంలో పేదలు, కార్మికుల కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్యాకేజీ ఉంటుందని చెప్పారు, మధ్యతరగతి, కర్షకులు, పేదలు, కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలు.. ఇలా అందరినీ ఆదుకునేందుకు ప్రకటించినట్లు చెప్పారు. వాస్త‌వానికి వివిధ రంగాలు రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్ల వరకు ప్యాకేజీని అడిగాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ ప్ర‌సంగంలో పేర్కొన్నారు.


అయితే  తాను రూ.20 లక్షల కోట్లు ఇస్తేనే ఆర్థిక వ్యవస్థ కుదురుకుంటుందని కొంత‌మంది నిపుణులు, పారిశ్రామిక రంగ సంఘాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఆర్థిక నిపుణులు, ఇత‌ర పారిశ్రామిక వేత్త‌లు  కేంద్రం రూ.10 లక్షల కోట్ల వరకు ప్యాకేజీ ప్రకటించవచ్చునని అంచ‌నా వేశాయి. కాని ప్ర‌ధాన‌మంత్రి వారి అంచ‌నాల‌కు మించి రూ.20ల‌క్ష‌ల కోట్లు ప్ర‌క‌టించ‌డంతో ఎంతో ఉత్సాహంతో స్టాకు మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: