దేశి అతిపెద్ద బ్యాంక్.. ఎస్‌బీఐ ఈ మధ్యకాలం తన కష్టమరలకు అదిరిపోయే ఆఫర్లు ఇస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. కొత్తగా కారు కొనాలి అని అనుకునే వారి భారీగా డిస్కౌంట్ ఇస్తుంది.. భారీ అంటే మాములుగా కాదు ఏకంగా 30వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 

 

కేవలం అది మాత్రమే కాదు మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఎస్‌బీఐ అందిస్తుంది. టాటా టియాగో కారు కొనుగోలుపై రూ.30 వేల వరకు తగ్గింపు ఆఫర్ ఇచ్చింది ఎస్‌బీఐ. అయితే ఈ ఆఫర్ కేవలం ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు బుక్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

 

ఇంకా ఈ డిస్కౌంట్ పై ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఇలా వివరాలను వెల్లడించింది. ''మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని యోచిస్తు్న్నారా? బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఒక ఆఫర్ అందుబాలో ఉంది. టాటా టియాగో కారును యోనో ద్వారా బుక్ చేసుకోండి. కళ్లుచెదిరే డిస్కౌంట్ పొందండి. ఇంకా రూ.3,000 విలువైన యాక్ససిరీస్‌ను ఉచితంగా పొందండి'' అంటూ ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

 

ఇంకా మీరు కారు కొనేందుకు లోన్ పొందాలి అనుకుంటే ఎస్‌బీఐ యోనో యాప్ మంచి వడ్డీ రేటు కూడా ఇస్తుంది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కార్ లోన్ కోసం అప్లై చేసుకుంటే కేవలం 7.75 శాతం వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మరో 5 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే జూన్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ లోనే అందుబాటులో ఉంటుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: