ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ధిక పరిస్థితులు అంతగా బాగాలేదు.. తినడానికి తిండి లేక చాలా మంది రోడ్డున పడ్డారు. రూపాయి కోసం అనేక పాట్లు పడుతున్నారు.. ముఖ్యంగా డబ్బులను ఆదా చేసే విషయం లో మాత్రం జనాలు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని మనీ సేవింగ్ యాప్ లు ప్రస్తుతం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..  అలాంటి ఒక ఇప్పుడు ప్రజల నోట్లో నానుతుంది.. ప్రతి నెలా కచ్చితంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, పెట్రోల్ ఖర్చు, గ్యాస్ సిలిండర్ ఖర్చు ఇలా ఇంట్లో సరుకులు ఇలా ఎన్నో రకాల ఖర్చులు ఉంటాయి.




అయితే వీటన్నింటికీ లేదా వీటిల్లో కొన్నింటికైనా మనకు క్యాష్‌బ్యాక్ లభిస్తే చాలని ఆశపడుతుంటాము.. అలాంటి వారి కోసం అదిరిపోయే యాప్ అందుబాటులోకి వచ్చింది..ఈ యాప్ ద్వారా లావాదేవీలను చేస్తే క్యాష్ బ్యాక్ పక్కా అంటున్నారు. ఆ యాప్ నే FYOOL యాప్. ఇది కూడా పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యాప్ ద్వారా బిల్లు చెల్లింపుపై ఏకంగా సగానికి పైగా రేట్లు తగ్గుతాయని అంటున్నారు.



ఢిల్లీకి చెందిన రౌనక్ శర్మ అనే వ్యక్తి ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు..పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, లిక్కర్ బిల్లు చెల్లింపులపై ఈ యాప్ ద్వారా క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ క్యాష్‌బ్యా్క్ డబ్బుతో ఇంట్లోకి సరుకులు కొనొచ్చు. లేదా మనీ ట్రాన్స్ఫర్ కూడా సులువుగా చేసుకోవచ్చు..మీరు మీ ఫ్యూయెల్ బిల్లు లేదా షాపింగ్ బిల్లును ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీకు మీ బిల్లుపై సగం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రూ.2,000లోపు బిల్లులకు ఇది వర్తిస్తుంది. డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసి వాడితే క్యాష్ బ్యాక్ రాదట..

మరింత సమాచారం తెలుసుకోండి: