మేడ్ ఇన్ తమిళనాడు
"ప్రతి  వస్తువు తమిళనాడులో తయారవ్వాలి. ఇక్కడి నుంచే ఎగుమతులు జరగాలి.  ప్రతి వస్తువు మీద 'మేడ్ ఇన్ తమిళనాడు' అని ఉండాలి" అని తమిళనాడు ముఖ్యమంత్రి స్థాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఎగుమతులలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ప్రథమ స్థానానికి చేరుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు.  1.93 లక్షల కోట్లు విలువైల ఎగుమతులు తమిళనాడు నుంచే జరుగుతున్నయని చెప్పారు. భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో తమిళనాడు వాట  ఎనిమిది శాతం పైన ఉండటం సంతోషకరమన్నారు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం ఆ రాష్ట్రం  ఈ నెల 20 నుంచి 26 వరకూ వాణిజ్యో వారం పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగి  సదస్సులో ముఖ్యమంత్రి స్థాలిన్ కీలకోపన్యాసం చేశారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని కార్యక్రమానికి హాజరైన పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. 2030 నాటికి వంద మిలియన్  అమెరికన్  డాలర్లు ఎగుమతులు చేయాలని   లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ కమిటీకి ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారని ప్రకటించారు.

 'తమిళవాడు  అభివృద్దే దేశాభివృద్ధి' అని ఆహూతుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. ప్రంపంచంలో పేరెన్నిక గన్న కంపెనీలు మరిన్ని తమిళనాడులో పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు చేయాలని  ముఖ్యమంత్రి కోరారు. పెట్టబడి సదస్సులను ఇక నుంచి చెన్నై నగరంలో కాకుండా పరిసర నగరాలైన మధురై, కృష్ణగిరి, కాంచీపురం, తంజావూరు, సేలం తదితర ప్రాంతాలలో నిర్వహించాలని స్థాలిన్ నిర్వాహకులకు సూచించారు. వివిధ నగరాల్లో సదస్సులు నిర్వహించడం వల్ల అభివృద్ధి అన్ని ప్రాంతాలలో జరిగే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 24 కంపెనీలు ముఖ్యమంత్రి స్థాలిన్ సమక్షంలో ఎం.ఓ.యులు చేసుకున్నాయి. ఈ కంపెనీల ద్వారా యాభై వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: