టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ 'విరోష్' (VIROSH) పెళ్లి జాతర ఒక కొలిక్కి వచ్చింది. ఉదయపూర్ ప్యాలెస్‌లో రాయల్ వెడ్డింగ్, ఢిల్లీలో ప్రధాని మోదీ ఆశీస్సులు.. ఇలా ప్రతిదీ ఒక రేంజ్‌లో ప్లాన్ చేసిన 'రౌడీ స్టార్' విజయ్ దేవరకొండ, ఇప్పుడు తన అర్ధాంగి రష్మిక మందన్నతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా వీరిద్దరూ హైదరాబాద్‌లోని తమ నివాసంలో గృహప్రవేశ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


విజయ్ దేవరకొండ తల్లి మాధవి గారు మొదటి నుంచీ రష్మికను తన సొంత కూతురిలా చూసుకుంటున్నారు. పెళ్లికి వారసత్వ గాజులు బహుమతిగా ఇచ్చిన ఆమె, ఇప్పుడు కోడలిని ఇంటి మహాలక్ష్మిలా ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త కోడలు రష్మిక చేతుల మీదుగా ఇంట్లో పాలు పొంగించినట్లు తెలుస్తోంది. మన తెలుగు సంప్రదాయం ప్రకారం కొత్త పెళ్లికూతురు ఇంట్లోకి అడుగుపెట్టాక చేసే మొదటి పవిత్రమైన పని ఇదే. గృహప్రవేశం తర్వాత విజయ్-రష్మిక దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారట. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయ్యి ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తున్నాయి.



విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో సుమారు రూ. 15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది.పెళ్లి తర్వాత రష్మిక ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఈ ఇంటిని కాస్త రీ-మోడలింగ్ చేయించారట విజయ్. ముఖ్యంగా రష్మిక కోసం ఒక ప్రత్యేకమైన 'జిమ్' మరియు 'గార్డెన్ ఏరియా'ను సెట్ చేసినట్లు టాక్.ఈ ఇల్లు ఫుల్ సెక్యూరిటీతో, బయటి వారికి కనబడకుండా అత్యంత ప్రైవేట్‌గా ఉంటుంది. అందుకే వీరిద్దరూ ఇక్కడే తమ మధురమైన వైవాహిక జీవితాన్ని గడపబోతున్నారు.విజయ్ మరియు రష్మిక కలిస్తే వారి నెట్ వర్త్ సుమారు రూ. 135 కోట్లు దాటుతోంది.హైదరాబాద్‌లోనే కాకుండా ఈ జంటకు ముంబై, గోవా మరియు కూర్గ్‌లో కూడా సొంత ఇళ్లు ఉన్నాయి.



గృహప్రవేశం ముగిసిన వెంటనే, ఈ జంట తమ తదుపరి సినిమాల షూటింగ్స్‌కు వెళ్లాల్సి ఉంది. విజయ్ 'VD 12'తో, రష్మిక 'పుష్ప 2' సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.హైదరాబాద్‌లోని కొత్త ఇంట్లో ఈ చిన్నపాటి వేడుక ముగిశాక, ఇప్పుడు అందరి దృష్టి మార్చి 4న జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ మీదే ఉంది. గచ్చిబౌలిలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం విజయ్ భారీ విందు ఏర్పాటు చేశారు.సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి మురిసిపోయిన ఫ్యాన్స్, ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ వారు ఒకరికొకరు తోడుగా ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రష్మిక ఇప్పుడు దేవరకొండ ఇంటి 'మహాలక్ష్మి'గా మారిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: