బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష స్పందనను అందుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, గట్టిపడిన భావోద్వేగాలు, అద్భుతమైన బ్యాక్‌డ్రాప్ అన్ని కలగలిపి రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మొదటి నిమిషం నుంచి చివరి వరకు ఉత్కంఠతో కట్టిపడేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన స్పందన అభిమానులను ఉత్సాహపరిచింది. “యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించిన అద్భుతమైన చిత్రం ఇది. ప్రియాంక తన అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు” అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.మహేష్ బాబు చేసిన ఈ ప్రశంసలకు ప్రియాంక చోప్రా స్పందించిన తీరు అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. “థాంక్యూ మై ఫ్రెండ్… త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం” అంటూ ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ఒక్క కామెంట్‌తోనే ఆమె ఒక కీలక విషయాన్ని వెల్లడించినట్టైంది.

ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ లో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో ప్లాన్ చేసినట్లు ఆమె కామెంట్ ద్వారా స్పష్టమైంది.అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, మంచుతో కప్పుకున్న పర్వత ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని నిర్ణయించడం చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇంతవరకు భారతీయ సినిమాల్లో అరుదుగా మాత్రమే ఉపయోగించిన ఈ లొకేషన్, ‘వారణాసి’ చిత్రాన్ని సాంకేతికంగా మరియు విజువల్‌గా కొత్త స్థాయికి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి ప్రతి చిత్రంలోనూ సరికొత్త అంశాలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన వాతావరణంలో సాహసోపేతంగా షూటింగ్ చేయాలని నిర్ణయించడం ఆయన దృఢసంకల్పాన్ని తెలియజేస్తోంది. ఇక ఈ అప్డేట్ తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ “జక్కన్న ప్లాన్ సూపర్”, “ఇది నిజంగా హాలీవుడ్ స్థాయి విజన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: