సినిమా విడుదలైన తర్వాత సాధారణంగా రెండో లేదా మూడో వారానికి కలెక్షన్లు తగ్గిపోవడం సహజం. కానీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం మూడవ వీకెండ్‌లోనూ స్థిరమైన వసూళ్లను నమోదు చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా ప్రభాస్ పాల్గొన్న భాగం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆ ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ తనకు ఎదురైన ఓ సరదా సంఘటనను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, “మీ అభిమానులు చాలా మంది నన్ను ‘డార్లింగ్ నెంబర్ ఇవ్వండి’ అని అడుగుతుంటారు. నేను ‘డార్లింగ్ నెంబర్ నా దగ్గర లేదు రా బాబు’ అని చెప్పాల్సి వస్తుంది,” అని నవ్వుతూ వివరించాడు. ఈ మాటలకు స్పందించిన ప్రభాస్ సరదాగా, “ఇటు రా… నీకు నా నెంబర్ ఇస్తాను. కానీ నెంబర్ ఉంది కదా అని ఇబ్బంది పెట్టకు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే ఫోన్ చెయ్యి. ఊరికే చేస్తే తంతాను,” అని అన్నాడు. ఆయన చెప్పిన విధానం పూర్తిగా సరదాగా ఉన్నప్పటికీ, అందులో కనిపించిన ఆప్యాయత అభిమానుల హృదయాలను హత్తుకుంది.
ఆ వీడియోను చూసినవారికి అది ఓ స్టార్ హీరో మరియు యువ నటుడి మధ్య జరిగిన సంభాషణలా కాకుండా, ఓ అన్నయ్య తన తమ్ముడితో ప్రేమగా, కొంచెం ఆటపట్టిస్తూ మాట్లాడినట్టుగా అనిపించింది. ప్రభాస్ వ్యక్తిత్వంలో కనిపించే సింప్లిసిటీ, ఆప్యాయత, జూనియర్ల పట్ల చూపించే ప్రోత్సాహం మరోసారి ఈ ఇంటర్వ్యూలో ప్రతిఫలించాయి. అందుకే అభిమానులు సోషల్ మీడియాలో “ఇందుకే అన్నా నువ్వు అందరి గుండెల్లో డార్లింగ్ అయ్యావు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి