ఈ సినిమాకి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా ఈ పోస్టర్లో సూర్య కళ్ళద్దాలు పెట్టుకొని ఒక చిన్నారిని ఎత్తుకొని మరి కనిపించారు. ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వైరల్ గా మారింది. సూర్యకి జోడిగా మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రల నటిస్తూ ఉండగా జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలైలో ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
లక్కీ భాస్కర్ వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా స్టోరీ ఒక మధ్యవయసుడికి మరియు ఒక యువతికి మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా హీరో సూర్య సినిమాలు సరైన సక్సెస్ అందుకోలేదు. మరి విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో ఏ విధంగా సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి