
అయితే ఈ దేశంలో ఉన్న మీడియా మోడీ మీద ద్వేషంతో ఈ కుట్రను పొడిగించి, పోషించిందని తెలుస్తుంది. అయితే సోరోస్ సంస్థ చేసిన ఈ కుట్ర వల్ల నష్టపోయింది సాధారణ ప్రజలు అని తెలుస్తుంది. మన వాళ్లు ఆ షేర్లలోని డబ్బులు విత్ డ్రా చేసుకున్నారట. అయితే మనతో పాటు విదేశాల వాళ్ళు కూడా డబ్బులు విత్ డ్రా చేసుకున్నారంట. షేర్లు అమ్మేయడంతో పెద్ద సంక్షోభం నెలకొందని తెలుస్తుంది. ఈ సంక్షోభం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఒక సాధారణ పరిస్థితిలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది.
దాంతో మళ్లీ మన ఇండియా టాప్ ఫైవ్ గ్లోబల్ మార్కెట్లోకి ఎగబాకింది. స్టాక్ మార్కెట్లో అమెరికా 44.5 ట్రిలియన్ డాలర్లతో నెంబర్ వన్ స్థానంలో ఉందట. దాని తర్వాత రెండో స్థానంలో చైనా 10.3 ట్రిలియన్ డాలర్లతో ఉందట. మూడో స్థానంలో జపాన్ 5.7 ట్రిలియన్ డాలర్లతో ఉందట. ఆ తర్వాత హాంకాంగ్ 5.1 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉందట. అయితే మన భారతదేశం 3.3 ట్రిలియన్ డాలర్లతో 5వ స్థానంలో నిలిచిందని అంటున్నారు.
అయితే ఫ్రాన్స్ 3.2 డాలర్లతో ఆరో స్థానంలోకి పడిపోయిందని తెలుస్తుంది. అంటే భారతదేశం 3.3 ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉంటే, దానికన్నా అతి తక్కువ వ్యత్యాసంతో అంటే 3.2 ట్రిలియన్ డాలర్లతో ఫ్రాన్స్ వెనకబడిందని తెలుస్తుంది. అయితే ఇదంతా, ఈ లెక్కంతా బ్లూమ్బెర్గ్ ఇచ్చిన నివేదిక ద్వారా ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.