జులై 19న చీకోటి ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు మెదక్ లోని హోటల్ లో జరిగాయి. ఆ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు కొంతమంది నాయకులు సాయం చేశారని, మరికొందరు రూమ్ లు ముందుగానే బుక్ చేశారని, ఇంకొందరు ఆ పార్టీలో మందేసి చిందేశారని అంటున్నారు. ఆ నాయకుల పేర్లు ఇప్పటికే చూచాయగా బయటకొచ్చాయి. ఇక అవి అధికారికం అయితే మాత్రం వారు కూడా ఉచ్చులో చిక్కుకున్నట్టే..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చీకోటి ప్రవీణ్‌ ఈడీ రైడ్స్ హాట్ టాపిక్ గా మారాయి. క్యాసినో నిర్వాహకుడు ప్రవీణ్, అతని పార్టనర్ మాధవరెడ్డిపై ఈడీ దాడుల నేపథ్యంలో వ్యవహారం  హాట్ హాట్ గా మారింది. ఈడీ విచారణకు పిలవడంతో నేతల్లో హడావిడి మొదలైంది. జులై 19 న చీకోటి బర్త్‌ డే సందర్భంగా మెదక్ లోని ఓ హోటల్ లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుసగా పార్టీలు జరిగాయట. చీకోటి కొంతసేపు వారితో ఉన్నా, మరికొంతసేపు వేరే ప్రాంతానికి వెళ్లొచ్చారట. అయితే ఆయన కోసం వచ్చినవారు అక్కడే ఉండి తాగితందనాలు ఆడారని అంటున్నారు. ఈ బర్త్ డే పార్టీకి ఓ మున్సిపల్ చైర్మన్ కొడుకు హాజరయ్యారని అంటున్నారు. ఇటీవల జిల్లా నేతలు గోవా టూర్ కి వెళ్లారని, అక్కడ కొంతమంది అధికారులు కూడా చీకోటికి పరిచయం అయ్యారని చెబుతున్నారు.

రాజకీయ నాయకులకు ఇలాంటి వారితో సంబంధాలున్నాయంటే పెద్దగా జరిగే నష్టమేమీ లేదు, మహా అయితే పబ్లిసిటీ పెరుగుతంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఉన్న సంబంధాలు బయటపడేలా ఉన్నాయి. దీంతో వారు టెన్షన్ పడుతున్నారు. విచారణలో తమ పేర్లు బయటపడితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందేమోనని ఆందోలన చెందుతున్నారు. కొంతమంది ఆయనతో కలసి గోవా ట్రిప్ లు వేశారు, ఇటీవల ఆయనతో క్లోజ్ గా ఉన్నట్టు స్థానికంగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. సడన్ గా ఇప్పుడు ఈడీ దర్యాప్తు, చీకోటి వ్యవహారం పూర్తిగా వెలుగులోకి రావడంతో వారంతా తమకు ఏమైనా జరుగుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయా..? చీకోటినుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఈడీ అధికారులు, మరికొందరికి నోటీసులిచ్చే అవకాశముందా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: