ఇటీవల కాలంలో సభ్య సమాజంలో గౌరవంగా బ్రతకటానికి ఉద్యోగమో.. వ్యాపారమో చేసుకుంటూ ఉన్న వారి కంటే ఇక ఏదో ఒక విధంగా డబ్బు సాధించి జల్సాలు చేయడానికి ఇష్టపడుతున్న వారే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. వెరసి ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక రోజు రోజుకి మనుషుల్లో మోసం చేసే తత్వం అనేది పెరిగిపోతుంది అన్నది అర్థమవుతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా ఎన్నో చిత్రవిచిత్రమైన రీతిలో ఇక మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. దీంతో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా కూడా చివరికి అందిన కాడికి దోచుకోవడానికి ఎంతో మంది కేటుగాళ్లు సిద్ధంగా ఉంటున్నారు అని చెప్పాలి. ఇటీవల కాలంలో అటు కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఉద్యోగం చేయడం చేస్తూ ఉన్నారు. అయితే మరి కొంతమంది ఇలా వర్క్ ఫ్రం హోం ఉన్న ఉద్యోగం దొరికితే బాగుండు అని సెర్చ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలను ఇక్కడ కేటుగాళ్లు ఆసరాగా మార్చుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారీ స్కాంకి పాల్పడ్డారు. వర్క్ ఫ్రం హోం ఉన్న ఉద్యోగం ఇప్పిస్తాము అంటూ నమ్మించి ఏకంగా 200 కోట్ల రూపాయల స్కాంకు పాల్పడ్డారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఉద్యోగం ఇప్పిస్తామని 30 వేల మందిని నమ్మించి మోసం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల నిందితులను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఇక బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని విచారణలో తేలింది.  దుబాయ్ కి చెందిన సంస్థలతో లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wfh