పాలక్ పన్నీర్ తిణ్ణం కానీ ఆలూ పాలక్ ఎప్పుడు తినలేదు అబ్బా అని అనుకుంటున్నారు కదా! అవును చాలామందికి ఆలూ పాలక్ వంటకం అనేది ఉంది అని కూడా తెలియదు.. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెజ్ కర్రీస్ తినారు కాబట్టి. ఇకపోతే అలాంటి ఆలూ పాలక్ కర్రీ ని ఇంట్లోనే రుచిగా ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్దాలు.. 

 

పాలకూర - 4 కట్టలు,

 

బంగాళాదుంపలు - మూడు, 

 

ఆవనూనె - టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు - రుచికి సరిపడా, 

 

దనియాల పొడి - 2 టీస్పూన్లు, 

 

పసుపు - అరటీస్పూను, 

 

కారం - పావు టీస్పూను, 

 

జీలకర్ర - టీస్పూను, 

 

గరం మసాలా - ఒకటిన్నర టీస్పూన్లు,

 

ఎండుమామిడికాయ పొడి - టీస్పూను, 

 

ఇంగువ - టీస్పూను. 

 

తయారీ విధానం.. 

 

కడాయిలో ఆవనూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేయించాలి. ఆతర్వాత దనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాలి. సన్నగా తరిగిన పాలకూర వేసి కలపాలి. మూతపెట్టి సిమ్‌లో ఐదు నిమిషాలు ఉడికించి అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతు ఉండాలి. ఉడికిన తరవాత మూత తీసి ఆలూ ముక్కలు వేసి కలిపి కాసేపు వేయించాలి. చివరగా గరంమసాలా, ఎండు మామిడికాయ పొడి వేసి కలిపి మరో పది నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే ఆలూ పాలక్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: