కావాల్సిన ప‌దార్థాలు:
ప‌చ్చి చింతకాయలు- పావుకేజీ
వేరుశనగలు- వంద గ్రాములు 
పచ్చిమిర్చి- వంద గ్రాములు

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
నూనె- ఒక టీస్పూన్‌
జీలకర్ర- ఒక టీస్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా స్టై మీద పాన్ పెట్టి చింతకాయలు మునిగేంతవరకు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ త‌ర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరే పాన్‌లో టీ స్పూన్‌ నూనె, పచ్చిమిర్చి వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో వేరుశనగలు వేసి వేయించాలి. 

 

ఇప్పుడు పూర్తిగా చల్లారిన చింతకాయల్ని ఒక జల్లెడలో వేసి వాటి నుంచి రసం తీసుకోవాలి. ఆ త‌ర్వాత‌ వేయించుకున్న పచ్చిమిర్చి, వేరుశనగలు, తగినంత ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, చింతకాయల రసం తీసుకుని మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని తాలింపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంతే ప‌ల్లీ చిత‌కాయ ప‌చ్చ‌డి రెడీ..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: