కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్ ముక్కలు - ఒక‌కిలో
అల్లం తురుము - మూడు టేబుల్ స్పూన్‌
కారం - ఒక టేబుల్ స్పూన్‌

 

కరివేపాకు - రెండు రెమ్మ‌లు
ఉల్లిపాయ ముక్క‌లు - ఒక‌టిన్న‌ర కప్పు
ఉప్పు - రుచికి స‌రిప‌డా

 

కొబ్బరి తురుము - మూడు టీస్పూన్లు
మిరియాలు - ఒక‌ టీస్పూన్‌
జీలకర్ర - రెండు టీస్పూన్ల‌

 

సోంపు - ఒక టీస్పూన్‌‌
నూనె - ఆరు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - ఒక క‌ట్ట

 

త‌యారీ విధానం:
ముందు ఓ మిక్సీ జార్ తీసుకుని.. అందులో రెండు టీ స్పూన్ల అల్లం ముక్క‌లు, పావు క‌ప్పు ఉల్లిపాయ ముక్క‌లు, మిరియాలు, కొబ్బ‌రి తురుము, జీల‌క‌ర్ర‌, సోంపు వేసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. 

IHG

ఆ త‌ర్వాత‌ కరివేపాకు, అల్లం ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసి బాగా కలపాలి. అనంత‌రం చికెన్ ముక్కలు, రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు వేయించాలి.

IHG

ఆ త‌ర్వాత చికెన్ ముక్కలు మునిగేలా నీళ్లు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. నీరు తగ్గి ఇగురులా అయ్యాక, ముక్క ఉడికిందో లేదో చూసుకుని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే  ఘుమ‌ఘుమ‌లాడే జింజర్ చికెన్ మసాలా రెడీ అయిన‌ట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. మ‌రి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: