కాయగూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే విటమిన్స్, ప్రోటీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కాయగూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక కాయగూరలో బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. బీరకాయలో ఐరన్ ఉంటుంది.కాబట్టి ఇది తింటే మన ఎముకలు కండరాలు ఎంతో దృఢంగా ఉంటాయి. కాబట్టి బీరకాయ మెదిపి కూర తినండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక రుచికరమైన బీరకాయ మెదిపి కూర ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....


ఇక రుచికరమైన బీరకాయ మెదిపి కూర తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు....

బీరకాయలు  - 4
పప్పు సామానులు - తగినంత
చింతపండు  - చిన్న నిమ్మకాయ అంత
ఉప్పు, పసుపు - తగినంత

 
ఇక రుచికరమైన బీరకాయ మెదిపి కూర తయారు చేసే విధానం  తెలుసుకోండి....

ముందుగా బీరకాయల్ని ముక్కలుగా తరుగుకోవాలి. ఇక ఈ కూర రుచి ముక్కలు తరుగుకోవటంలోనే వుంది. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా రెండు అంగుళాలు పొడవు ఉండేలా కట్ చేసుకోవాలి. ముందుగా శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి , కరివేపాకు వేసి చిటికెడు ఇంగువ కూడా కలిపి పోపు ఎర్రగా వేగాక తరిగిన బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, వేసి కలియబెట్టాలి.ఇక మూతపెట్టే ముందు చింతపండుని ఉండలా చేసి కూర మధ్యలో పెడితే కూర వుడుకుతున్నప్పుడు ఆ పులుపు కూరకి పడుతుంది. కూర కదిపేటప్పుడు చింతపండు కూర మొత్తంలో కలవకుండా చూసుకుంటూ కదపాలి. కూర అంతా ఉడికాక చింతపండు తీసేయాలి అప్పటికి అందులోని పులుపు కూరకి పడుతుంది. కూర కొంచం గ్రేవీగా కొంచం పొడిగా ఉండేలా చూసుకుని ఆపాలి.ఇక రుచికరమైన బీరకాయ మెదిపి కూర తయారైనట్లే. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాల గురించి తెలుసుకోండి...

 


మరింత సమాచారం తెలుసుకోండి: